టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంత( Naga Chaitanya, Samantha ).నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇక వీరిద్దరూ గతం లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.కానీ వీరి జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది.
ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని తెలిపి పెద్ద షాక్ ఇచ్చారు.
కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు.
పెళ్లి తర్వాత ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది.ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు ప్రేమ జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత పలు సినిమాలలో, యాడ్స్ లలో నటించారు.కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని చాలా కబుర్లు చెప్పుకున్నారు.ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు.
ఈ జంట మధ్య ఎటువంటి అడ్డు ఉండదని.
ఎప్పటికైనా ఈ జంట ఆదర్శంగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఏడాది కిందట సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించి తమ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
వరస ప్రాజెక్టులతో ఇద్దరు బాగా బిజీగా మారారు.సమంత మాత్రం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్( Bollywood ) లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక చైతూ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.అయితే గత కొన్ని రోజుల నుండి చైతూ మరో హీరోయిన్ శోభిత( Shobhita ) తో ప్రేమలో ఉన్నాడని.డేటింగ్ చేస్తున్నాడని బాగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఆ మధ్య వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో ఆ ఫోటోలో చూసి మరింత అనుమానం పెడుతున్నారు జనాలు.
రీసెంట్ గా కూడా నాగచైతన్య, శోభిత ఫోటో ఒకటి కూడా బాగా వైరల్ అయింది.అయితే ఇదంతా పక్కనే పెడితే ఇప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ప్రస్తుతం సమంత షాకుంతలం సినిమా( Shakunthalam movie )లో నటించగా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఈ సిని బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉన్నారు.
అయితే ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా ఆ హీరో ప్రమోషన్స్లో భాగంలో సమంతతో దిగిన ఫోటోలను పంచుకున్నాడు.అందులో ఒక ఫోటోలో హగ్ చేసుకొని ఉండగా ఆ ఫోటో చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.ఓ నెటిజన్ ఓవైపు సమంతను చూసి నాగ చైతన్య ఏడుస్తున్నాడంటూ కామెంట్ చేయగా మరో నెటిజన్.
మరి నాగ చైతన్య శోభితతో దిగిన ఫోటో ఏంటి.ఆల్రెడీ దేవ్ పెళ్లి చేసుకున్నాడు.
సమంత కూడా అతడితో ఫ్రెండ్ గా ఉంటుంది.సమంత విషయంలో అలా ఆలోచించకూడదు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.