3 రోజుల్లోనే రూ. 71 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ పై నాని దండయాత్ర!

నాచురల్ స్టార్ నాని ( Nani ) తాజాగా నటించిన సినిమా దసరా( Dasara ).ఈ సినిమాతో ఈయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

మొన్న శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సైతం అందుకుంటుంది.పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.సంతోష్ నారాయణన్( Santosh Narayan ) సంగీతం అందించాడు.

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యిన ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా దూకుడు చూపిస్తుంది.నాని చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ మీద తన పరిధిని మించి దండయాత్ర చేస్తున్నాడు.

Advertisement

ముందు నుండి నాని కాన్ఫిడెంట్.టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ సినిమా రిలీజ్ గ్రాండ్ కు సహాయ పడ్డాయి.ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది.

అలాగే రెండు రోజుల్లోనే ఏకంగా 50 కోట్లు క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.దీంతో టైర్ 2 హీరోల్లో నాని సంచలన రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఇక తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ను మేకర్స్ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.ఈ సినిమా మూడు రోజుల్లో 71 కోట్ల ( Dasara Box Office Collections ) రూపాయలు వసూళ్లు చేసినట్టు ప్రకటించారు.

మరి ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 100 కోట్ల మార్క్ చేరుకోవడం దసరా సినిమాకు కష్టమేమి కాదు.చూడాలి ఈ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు