ఆ పార్టీ టార్గెట్ గా ' పల్లె పల్లె కూ ఓబీసీ .. ఇంటింటికీ బీజేపీ ' 

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి ( BJP ) అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుంది.ప్రజలకు చేరువయ్యేందుకు రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా తెలంగాణలో ఎగరవేసేందుకు తీవ్రంగానే ప్రయత్నం చేస్తుంది.

 Bjp Palle Palleku Obc Intintiki Bjp Campaign Targeting Brs Party Detals, Telanga-TeluguStop.com

ఇప్పటికే కేంద్ర మంత్రులు,  కీలక నాయకులు పదేపదే తెలంగాణలో పర్యటిస్తూ,  బిఆర్ఎస్ ప్రభుత్వంపై( BRS ) తీవ్ర స్థాయిలో విమర్శలతో బీరుచుకుపడుతున్నారు.ఇక నిత్యం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన బిజెపి ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది.

దీంతో పాటు తెలంగాణలోని ప్రధాన సామాజిక వర్గాలకు మరింత దగ్గర అయ్యేందుకు బిజెపి సరికొత్త వ్యూహాలను రచిస్తుంది.దీనిలో భాగంగానే తెలంగాణలో 50 లక్షల కు పైగా ఉన్న బీసీ కుటుంబాలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Bc Votes, Brs, Brs Bjp, Cm Kcr, Modi, Obc Catego

దీనిలో భాగంగానే ‘ పల్లె పల్లెకు ఓబీసీ .ఇంటింటికి బిజెపి అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్లాన్ చేశారు.ఈ మేరకు వచ్చే నెల ఆరో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి దీనిని ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో బీసీలకు ( BC ) ఏ విధంగా అన్యాయం జరిగింది అనే దాన్ని వివరించేందుకు ఓబీసీ మోర్చా నేతలు సిద్ధం అవుతున్నారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Bc Votes, Brs, Brs Bjp, Cm Kcr, Modi, Obc Catego

అలాగే బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాల పైన కరపత్రాన్ని రూపొందించి, బీసీ సామాజిక వర్గం ప్రజలకు వాటిని అందించే విధంగా ప్లాన్ చేశారు.అలాగే బీసీలకు రాజకీయంగా , ఆర్థికంగా విద్యాపరంగా , సామాజికపరంగా,  ఉద్యోగం,  ఉపాధి వంటి అంశాల పైన ప్రజలకు వివరించాలని నిర్ణయించారు   దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీసీలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయించుకున్నారు.  తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఏ విధంగా అణిచివేశారు.వారికి ఏ విధంగా అన్యాయం చేశారు అనే విషయాలను హైలెట్ చేసేందుకు బిజెపి సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube