సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో ఒక వెలుగు వెలిగారు.ధర్మపురి శ్రీనివాస్( Dharmapuri Srinivas ) ( డీ ఎస్ ) ఒక దశలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగాను ప్రచారం జరిగింది .
ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) కి కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా బాధ్యతలు అప్పగించింది.అప్పట్లోనే రాజశేఖర్ రెడ్డితో సమానంగా కాంగ్రెస్ లో హవా డిఎస్ చూపించేవారు.
కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు వీర విధేయుడుగాను గుర్తింపు పొందడంతో ధర్మపురి శ్రీనివాస్ ( డీఎస్ ) హవా ఆ విధంగా కొనసాగింది.ఏపీ తెలంగాణ విభజన తర్వాత తలెత్తిన పరిణామాలు, కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు తదితర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్( BRS ) లో చేరారు .రాజ్యసభ సభ్యుడుగాను కొనసాగారు.అయితే కేసీఆర్ తో ఆయనకు విభేదాలు రావడంతో బిఆర్ఎస్ కు దూరమయ్యారు.
ఇక ఆరోగ్యపరంగాను డి.ఎస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.ఇక ఆయన రాజకీయాలకు దూరమైనట్లే అని అంతా భావిస్తుండగానే మరోసారి వార్తల్లోకి ఎక్కారు.రాజకీయంగా కీలకంగా వ్యవహరిస్తూ, తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన డిఎస్ కు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది.
తన ఇద్దరి కుమారులు ధర్మపురి అరవింద్ , ధర్మపురి సంజయ్ లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.అరవింద్ నిజామాబాద్ బిజెపి ఎంపీగా ఉండగా, సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.నిన్ననే కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా సంజయ్ వెంట డిఎస్ కూడా వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ , తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గేకు డిఎస్ లేఖ రాశారు.
దీంతో అసలు డిఎస్ ఎందుకు ఇలా వ్యవహరించారు అనేది ప్రశ్నర్దకంగా మారింది.నిన్ననే గాంధీభవన్ కు వచ్చిన డిఎస్ తాను రాహుల్ గాంధీకి మద్దతుగా ఉండేందుకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు.
కానీ ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లుగా తాజాగా లేఖ బయటకు వచ్చింది.దీనిపై డిఎస్ కుమారుడు సంజయ్ స్పందించారు.
తన సోదరుడు ఎంపీ అరవింధ్ పై విమర్శలు చేశారు.
తన తండ్రితో మాట్లాడనివ్వడం లేదని , ఈ వ్యవహారం అంతా అరవింద్ కనుసనల్లోనే జరుగుతోందని , బలవంతంగా ఆస్తులు కూడా రాయించుకున్నారంటూ సంజయ్ తన సోదరుడు అరవింద్ పై విమర్శలు చేశారు.డీఎస్ కుమారులు ఇద్దరు పార్టీలో ఉండడం, చాలాకాలంగా వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు పెరిగిపోవడం , ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం ఇవన్నీ డి.ఎస్ కు తలనొప్పిగా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ కు ఇప్పుడు మరోసారి ఆయన కుమారుల రాజకీయాలు కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.