రాళ్ళ వర్షం పడకుండ ఆంజనేయస్వామికి ముడుపుకట్టిన రైతులు

అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ముడుపులు కట్టి మొక్కలు చెల్లించుకున్న రైతులు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలలో శనివారం రైతులు ఎల్లారెడ్డిపేట గ్రామంలో రాళ్ల వర్షం కురవకుండ పంటలను కాపాడాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ముడుపులు చెల్లించుకున్నారు.

 Farmers Mudupu To Anjaneyaswamy For Not Raining Hail Storms Details, Farmers ,mu-TeluguStop.com

అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రైతులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలలో గ్రామ పురోహితులతోని ప్రత్యేక పూజలు చేయించి రాళ్ల వర్షం పడకుండా పంట పొలాలను కాపాడాలని పాడిపంటలను కాపాడాలని పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ముడుపులు చెల్లించుకుంటారు.

దీంతో రాళ్ళ వర్షం పడబోదని రైతుల నమ్మకం.

గ్రామ పురోహితులు రాచర్ల దాయానంద్ శర్మ ఎల్లారెడ్డిపేట రైతు చర్చా మండళీ అధ్యక్షులు సందు పట్ల రాజిరెడ్డి , వేలూరి నర్సింహారెడ్డి లచే గ్రామ రైతుల పక్షాన ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న రైతులందరికీ శ్రీ సాయి బాబా దేవాలయంలోని శివాలయం పూజారి ధర్మపురి శ్రీ కాంత్ శర్మ తీర్థ ప్రసాదములు వితరణ చేశారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ఈ కార్యక్రమంలో సద్ది మద్దుల రెడ్డి సంఘం అధ్యక్షులు వంగ బాల్ రెడ్డి,రైతులు మద్దుల బాల్ రెడ్డి, చంద్రారెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్, బిజెపి పార్టీ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి,పారిపెల్లి సంజీవ్ రెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్ది లక్ష్మారెడ్డి, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్ , రాంరెడ్డి,వెంకటరెడ్డి , రాజిరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube