ఆస్కార్…( Oscar ) ఈ ఒక్క అవార్డు ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అనేక వింతలకు, విశేషాలకు నాందిగా మారుతుంది.ముఖ్యంగా మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది కాబట్టి మనం ఈ రేంజ్ లో మాట్లాడుకుంటున్నాం.
ఇంత వరకు మన తెలుగు సినిమాకు( Telugu cinema ) ఇలాంటి ఒక అవార్డు దక్కలేదు.అయితే ఆస్కార్ అందుకోవడం ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణమే.
అలాగే ఈ ఆస్కార్ రావడానికి రాజమౌళి ( Rajamouli ) తన సొంత డబ్బు చాలా ఖర్చు పెట్టాడు అని కూడా చాలా రకాల వాదనలు వింటూ ఉన్నాం.నిజాలు ఏంటో తెలియకపోయినా కొన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆస్కార్ అవార్డు సాధించడం వల్ల రాజమౌళి ప్రతిభకు పట్టం కట్టినట్టుగా ఉంది కానీ దానివల్ల రామ్ చరణ్, ఎన్టీఆర్( Ram Charan NTR ) ఎంత నష్టపోయారు అనే విషయం బయటకు చెప్పట్లేదు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చాలా బిజీ స్టార్స్.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు.ఇద్దరికీ వరుసగా వచ్చే నాలుగైదు ఏళ్ల పాటు ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి.
ఇంత బిజీ లైనప్ లో తమ అవసరం లేకపోయినా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి మూడు నెలల పాటు అమెరికాలోనే కూర్చున్నారు.వీరిద్దరూ కేవలం ఆర్ ఆర్ ఆర్( RRR ) సినిమాకు ఆస్కార్ వస్తుంది అని ఒకే ఒక్క ఉద్దేశమే ఇందుకు గల కారణం.
కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తూ సినిమా అంతా రెడీగా ఉన్నా కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయాలను పట్టించుకోకుండా ఇన్ని నెలలపాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ రాజమౌళి సినిమాకు ప్రచారం చేసే పనిని పెట్టుకున్నారు.
ఒక రోజుకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల పారితోషకం దొరుకుతుంది ఈ ఇద్దరు నటులకు.అయినా కూడా వారికి డబ్బు అంటే లెక్కలేదు కేవలం రాజమౌళి మరియు ఆస్కార్ ఈ రెండే వారిద్దరికీ ముఖ్యం.అందుకే వారి సొంత సినిమాలను వదిలేసి, కోట్లాది రూపాయల పారితోషకం వద్దనుకొని మూడు నెలల పాటు అమెరికాలోనే ఉన్నారు.
దాదాపు 60, 70 కోట్ల రూపాయల మీద వీరిద్దరూ ప్రస్తుతం నష్టపోయారు.ఎక్కడ ఈ విషయం గురించి ప్రస్తావన రావడం లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ విషయం గురించి సర్వత్రా చర్చ నడుస్తుంది.
వీరు కాకుండా మరే హీరో అయినా కూడా ఇలా ఇంత సమయము, డబ్బును వెచ్చించి ఉండేవారు కాదు అంటూ అందరూ అనుకుంటున్నారు.