ఎయిర్‌బ్యాగ్‌ బైక్... ప్రమాదాలకు చెక్ పడాల్సిందే!

మనందరికీ తెలిసిందే… రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్రవాహనాలవే అని.అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మరణిస్తున్నవారి సంఖ్య కూడా ద్విచక్ర వాహన ప్రయాణికులే కావడం చాలా బాధాకరం.

 Airbag Bike Accidents Must Be Checked-TeluguStop.com

ఈ క్రమంలో భవిష్యత్తులో వీటిని నిర్ములించేందుకు చాలా కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి.ఇక తాజాగా ద్విచక్ర వాహన ప్రయాణికుల భద్రత కోసం 2 రకాల ఎయిర్‌బ్యాగ్‌లను( Airbag ) తయారు చేసేందుకు హోండా సన్నద్ధం అవుతోంది.

ఒకవేళ ఈ టైప్ బైక్స్ అందుబాటులోకి వస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.హోండా స్కూటర్లు, బైక్‌లలో ఈ ప్రయోగం చేయనుంది.

Telugu Airbag, Bussiness, Latest, Scooter, Ups-Latest News - Telugu

వాటి డిజైన్ కి తగినట్లుగా ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేసే పనిలో పడింది.త్వరిగతన వీటిని అందుబాటులోకి తెచ్చేదుకు సంస్థ విశ్వయత్నాలు చేస్తోంది.బైక్‌ ప్రయాణికుల కోసం ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేస్తున్న హోండా( Honda ) సంస్థ 2 రకాల ఎయిర్‌బ్యాగ్‌లను సిద్ధం చేస్తోంది.ఇందులో మొదటిది రైడర్ సీటు కింద ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

ఇది ప్రమాదం జరిగినప్పుడు బైక్ రైడర్‌ను రక్షించేలా పని చేస్తుంది.ఇక రెండవది మరొకటి బైక్‌ సీటు మధ్యలో 2వ ఎయిర్‌బ్యాగ్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఇది బైక్ రైడర్ దానిపై కూర్చున్న ప్రయాణీకుల మధ్య ఉంటుంది.ఇద్దరికీ భద్రతను అందించేలా దీనిని రూపొందించారు.

Telugu Airbag, Bussiness, Latest, Scooter, Ups-Latest News - Telugu

ఇకపోతే గతేడాది విడుదల చేసిన ‘హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్‌(Honda Gold Wing )’లో ఎయిర్‌బ్యాగ్‌ సౌకర్యాన్ని కల్పించిన సంగతి విదితమే.ఈ బైక్ కంప్లీట్లీ బిల్ట్-అప్ రూట్ ఆప్షన్ లో తీసుకువచ్చింది.థ్రోటల్ బై వైర్ ఇంజన్ మేనేజ్‌మెంట్ ఈ బైక్‌లో ఉంది.ఈ బైక్‌లో టూర్, స్పోర్ట్, ఎకాన్, రెయిన్ వంటి 4 రైడింగ్ మోడ్‌లు కలవు.దీని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఆప్షన్ లను పొందుతుంది.ఇక పియాగో కంపెనీ కూడా ద్విచక్ర వాహనాలకు ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేస్తోంది.

దీని కోసం ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్‌లను అందించే ఆటోలైవ్ అనే కంపెనీతో కంపెనీ జతకట్టింది.ఇలాంటి అధునాతన బైక్స్ ని తీసుకురావడం వల్ల ప్యూచర్ లో చాలా ప్రమాదాలను నివారించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube