మిరియాల సాగులో మేలు రకం విత్తనాలు.. సస్యరక్షణ పద్ధతులు..!

మిరియాల సాగు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 వేల ఎకరాల విస్తీర్ణంలో మిరియాల పంట సాగవుతోంది.

 Black Pepper Cultivation Good Variety Of Seeds Plant Protection Methods , Black-TeluguStop.com

కొన్ని ప్రాంతాలలో కాఫీ తోటలలో అంతర పంటగా కూడా సాగు చేస్తారు.మిరియాల(Black Pepper) ను వర్షాధార పంటగా చెప్పుకోవచ్చు.

ఎండిన మిరియాలను నల్లమిరియాలు అని, పై చర్మం తీసిన వాటిని తెల్ల మిరియాలు అని పిలుస్తారు.

మిరియాల లో మేలురకం విత్తనాల(Seeds) విషయానికి వస్తే, పన్నియుర్ విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు.

ఇందులో మూడు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.పన్నియుర్ -1 విత్తనాలలో ఎకరాకు దాదాపుగా 500 కిలోల దిగుబడి సాధించవచ్చు.

వీటిలో 30% వరకు ఎండు మిరియాలు వస్తాయి.పన్నియుర్ -2 విత్తనాలతో దాదాపుగా ఎకరాకు 1000 కిలోల దిగుబడి పొందవచ్చు.

వీటిలో 40 శాతం వరకు ఎండు మిరియాలు వస్తాయి.పన్నియుర్ -3 విత్తనాలు హైబ్రిడ్ రకానికి చెందినవి.

ఎకరాకు దాదాపుగా 750 నుంచి 800 కిలోల దిగుబడి (Yield)పొందవచ్చు.వీటిలో 25% వరకు ఎండు మిరియాలు వస్తాయి.

మిరియాలు సాగు చేసే విధానానికి వస్తే, మిరియాల తీగ అడుగు భాగంలో పెరిగిన రన్నర్ కొమ్మలను కత్తిరించి మార్చి -ఏప్రిల్ నెలల్లో పాలి దీన్ సంచిలో నాటాలి.ఇక జూన్ లేదా జూలై నెలలో అంతర పంటగా లేదా సాధారణ పంటగా నాటుకోవచ్చు.

ఎకరాకు దాదాపుగా 650 మొక్కలను నాటుకోవాలి.ఇక ప్రతి మిరియాల తీగ వద్ద కనీసం 8 నుండి 10 కిలోల పశువుల ఎరువు, 80 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాష్ ఎరువులు సంవత్సరంలో రెండు సార్లు అందించాలి.నాటిన కొత్తల్లో రెండు లేదా మూడు రోజుల్లో ఒకసారైనా నీటిని పారించాలి.ఇలా మూడేళ్ల వరకు నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తీగల నుండి పంటను వేరు చేశాక రెండు లేదా మూడు ఆకుల కణుపులు ఉండేలా తీగను కింది భాగంలో కత్తిరిస్తే తీగ పొడవుగా కాకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube