ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వారం రోజుల్లోనే నల్లటి వలయాలు పరార్ అవుతాయి!

నల్లటి వలయాలు.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సర్వసాధారణంగా ఫేస్ చేసే సమస్య ఇది.

 Follow This Simple Tip To Reduce Dark Circles Within A Week! Simple Tip, Dark Ci-TeluguStop.com

నల్లటి వల‌యాలకు కారణాలు అనేకం.ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, మద్యపానం, ధూమపానం, ప్రెగ్నెన్సీ, హార్మోన్ చేంజ్‌, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్లను అధికంగా వినియోగించడం, గంటలు తరబడి టీవీలు చూడటం, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ చర్మం నల్లగా మారుతుంది.

దీన్నేడార్క్ సర్కిల్స్(Dark circles) లేదా నల్లటి వలయాలు అని అంటారు.

డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖంలో కాంతి తగ్గుతుంది.

అందం దెబ్బ తింటుంది.ఈ క్రమంలోనే నల్లటి వలయాల‌ను వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

అయితే వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే కేవలం వారం రోజుల్లో నల్లటి వలయాలు పరార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం డార్క్ సర్కిల్స్ ను దూరం చేసే ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tip, Skin Care, Skin Care

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి (Multani clay), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు(turmeric), హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్(olive oil) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.చివరగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tip, Skin Care, Skin Care

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముల్తానీ మట్టి, పసుపు, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి పాల‌లో ఉండే పలు సుగుణాలు నల్లటి వలయాలను వేగంగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.కేవలం వారం రోజుల్లో నల్లటి వలయాలు మాయం అవ్వడాన్ని మీరు గమనిస్తారు.కాబట్టి ఎవరైతే డార్క్ సర్కిల్స్ తో తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube