సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త డైరెక్టర్లు సినిమా హీరోలు హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంతో ఇస్తూనే ఉంటారు.
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త డైరెక్టర్లు స్టార్ హీరోలతోనే సినిమా అవకాశాలను అందుకుంటూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే మామూలుగా ఒక సినిమాకు ఒకరు లేదా ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు.
ఎక్కువగా అంటే సినిమా కేవలం ఒక్క డైరెక్టర్ మాత్రమే ఉంటారని చెప్పవచ్చు.నిర్మాతలు అయితే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
కానీ మొదటిసారిగా ఒకే సినిమాతో ఏకంగా నలుగురు దర్శకులు పరిచయం కాబోతున్నారు.ఆ సినిమా ఏది ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న సినిమా మూడో కన్ను.ఈ సినిమాను సెవెన్ స్టార్ క్రియేషన్స్ ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాతో సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు లు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ.కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని అని తెలిపారు సాయికుమార్.అనంతరం తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.మొదటి సారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో మా యూనియన్లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న మా మెంబర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు.
ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు మరింత సంతోషంగా ఉంది అని తెలిపారు.ఈ సినిమాలో సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి సంబంధించిన కథ, కథనం, మాటలు కె.
వి రాజమహి అందించారు.అలాగే ఈ సినిమానాకు కె.వి రాజమహి, సునీత రాజేందర్ నిర్మించారు.