గౌతం ఆదానీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రముఖ వ్యాపారవేతలలో ఒకరు.అంతేకాదు ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆదానీ పేరు కూడా ఉంది.
బొగ్గు వ్యాపారం, క్రికెట్, మీడియా లాంటి ఎన్నో వ్యాపారాలలో అదానీ ఒక వెలుగు వెలిగారు.ఇదంతా నిన్నటి మాట.ప్రస్తుతం వేల కోట్ల రూపాయలు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు గౌతం అదానీ.వ్యాపారాలలోనే కాదు.
డబ్ల్యూపిఎల్ లో కూడా గౌతమ్ ఆదానీ కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.డబ్ల్యూపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హక్కులను వేలంలో 1289 కోట్లకు కొనుగోలు చేశారు.
ప్రపంచ స్టార్ ప్లేయర్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి దక్కించుకున్నారు.
డబ్ల్యూ పి యల్ లో ఐదు జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.అందులో అదానీ కు చెందిన గుజరాత్ జెయింట్స్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేతిలో 143 పరుగుల ఘోర పరాజయం పొందింది.రెండవ మ్యాచ్ ఉత్తర ప్రదేశ్ వారియర్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.చివరకు మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.170 పరుగుల లక్ష్యంతో దిగిన యూపీ, చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి ఉండగా గ్రేస్ హరీస్ అర్థ శతకం విజయానికి కారణం అయ్యింది.105 పరుగుల వద్ద ఏడు వికెట్లు నష్టపోయిన యూపీ ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు.కానీ గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లేస్టోన్ కీలక భాగస్వామ్యంలో 70 పరుగులు చేశారు.
గ్రేస్ హారిస్ 26 బంతుల్లో మూడు సిక్స్ లు, ఏడు ఫోర్ల తో 59 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.మొదటి రెండు మ్యాచ్లలో ఓటమి పొందిన గుజరాత్ జెయింట్స్, తర్వాత మ్యాచ్ లలో గట్టి పోటీ ఇచ్చి నిలబడకపోతే ఘోర పరాజయాలు ఖాతలో వేసుకోవాల్సిందే.