గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఇలియానా గురించిన వార్తలే కనిపిస్తున్నాయి.ఆమెను సౌత్ ఇండియా పరిశ్రమలు ఎందుకు బ్యాన్ చేశాయి ? ఆమె చేసిన తప్పేంటి ? అనే విషయంపై ఎవరికీ నచ్చింది వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు.అయితే ఇది కొత్త విషయం ఏమి కాదు 2011లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఆ వార్తలను వైరల్ చేయడం వెనక ఎవరికి హస్తముందో తెలియదు కానీ మొత్తానికి ఇలియానా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.కానీ నిజాన్ని నిర్ధారణ చేయడం మీడియా యొక్క ప్రధాన అంశంగా ఉండాలి కాబట్టి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత అనే కోణంలో పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి.
ఇలియానా తమిళంలో మోహన్ నటరాజన్ అనే ఒక నిర్మాతకు అప్పట్లో డేట్స్ ఇచ్చింది.ఆ సినిమా పేరు దైవత్తిరుమగళ్ ఆ సినిమాలో హీరోగా విక్రమ్ నటిస్తే మొదట హీరోయిన్ గా ఇలియానా అని అనుకున్నారు.
ఈ సినిమాలో అర్జున్ కూడా ఒక పాత్రలో నటించాడు.ఇలియానాను హీరోయిన్ గా అనుకున్న తర్వాత ఆమెకు అడ్వాన్స్ గా 40 లక్షల రూపాయలు ఇచ్చి డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.
ఆ టైంలో ఇలియానాకి అంత డిమాండ్ ఏమీ లేదు కానీ నిర్మాత ఇచ్చేశాడు.ఆ తర్వాత దర్శకుడిగా భూపతి పాండ్యన్ ని ఎంచుకున్నాక సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.దాంతో తన డబ్బు తనకు ఇవ్వాలి అంటూ మోహన్ ఇలియానా పై ఒత్తిడి చేశాడు.కానీ అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును ఎవరు వెనక్కి ఇస్తారు నేనైతే డబ్బు ఇవ్వను కావాలంటే మరో సినిమా కోసం నా డేట్స్ వాడుకోండి అంటూ ఇలియానా బదులు చెప్పింది.
ఇక్కడ ఆమె లీగల్ గా చాలా కరెక్ట్ గానే ఉంది.
అయితే అక్కడితో ఆ టాపిక్ ఆగలేదు నిర్మాత మరొక సినిమా చేస్తున్న సమయంలో ఇలియానాను డేట్స్ అడిగితే ఆ టైంలో రవితేజతో దేవుడు చేసిన మనుషులు సినిమాతో బిజీగా ఉంది ఇలియానా.అందువల్ల తనకు డేట్స్ కావాలంటే కొంతకాలం ఆగాలని ఆమె కోరిందట.డిసెంబర్లో డేట్స్ అడిగితే ఫిబ్రవరిలో ఇస్తానని చెప్పిందట.
కానీ నిర్మాతకు కోపం వచ్చింది ఆమెపై లీగల్ గా వెళ్లాలనుకున్నాడు.స్టార్ హీరోయిన్ లు సైతం డబ్బులు వెనక్కిస్తున్న రోజుల్లో ఇలియానా ఎందుకివ్వదు అనేది అతడి ప్రశ్న.
దాంతో సౌత్ ఇండియా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆమెను ఏ సినిమాలో కూడా తీసుకోకూడదని బ్యాన్ విధించింది.ఆ తర్వాత 2018 లో రవితేజతో ఇలియానా అమర్ అక్బర్ ఆంటోనీ చేసిన టైంలో ప్రొడ్యూసర్స్ కొంచెం గొడవ పెడితే సర్ది చెప్పారు.
ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు.ఈ మొత్తం ఎపిసోడ్లో ఇలియానా తప్పు ఉన్నట్టుగా అస్సలు లేదు.
కానీ ఆమెకు సపోర్ట్ చేసే వారే లేరు.ఎప్పుడు ప్రొడ్యూసర్ దృష్టిలోనే ఇండస్ట్రీ ఆలోచిస్తుంది కాబట్టి, పైగా ముంబై బేస్డ్ హీరోయిన్ కాబట్టి ఆమెను అందరూ తప్పు పడుతూ రకరకాల వార్తలు వైరల్ చేస్తున్నారు.