కూతురు జ్ఞాపకాలతో ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్... విడాకుల గురించి క్లారిటీ వచ్చినట్టేనా?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అయితే మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ అందరికి సుపరిచితమే ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.

 Kalyan Dev Made An Emotional Post With His Daughters Memories ,kalyan Dev, Sreej-TeluguStop.com

అయితే శ్రీజ ఇదివరకే ఒక వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.అనంతరం ఈమె కళ్యాణ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకొని మరో బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం వీరిద్దరు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఇకపోతే తరచూ కళ్యాణ్ దేవ్,శ్రీజ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కనుక చూస్తే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియ చేయలేదని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది.ఈ విధంగా కళ్యాణ్,శ్రీజ ఇద్దరు విడివిడిగా ఉండడంతో పిల్లలు కూడా శ్రీజ వద్ద ఉన్నారని తెలుస్తుంది.ఇలా తన పెద్ద కుమార్తె నివృత్తి, నవిష్క ఇద్దరు కూడా శ్రీజ వద్ద పెరుగుతున్నారు.

ఇకపోతే శ్రీజ కళ్యాణ్ ఇద్దరు విడిగా ఉండడంతో కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని చాలా మిస్ అవుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నాయి.

కళ్యాణ్ తో శ్రీజ కుమార్తె నవిష్క ఫిబ్రవరి 11 తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.ఈ క్రమంలోనే తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తాను తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు.తన కుమార్తెతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక వీడియోను షేర్ చేస్తూ మిస్సింగ్ యూ అంటూ కామెంట్ చేశారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వీరిద్దరి విడాకులు గురించి మరోసారి చర్చలు జరిగాయి.దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని అందుకే శ్రీజ వద్దకు వెళ్లకుండా తన కుమార్తెను చూడకుండా ఈయన తన కూతురిని మిస్ అవుతున్నాను అంటూ ఇలా ఎమోషనల్ పోస్ట్ చేశారు అంటూ పలువురు ఈ పోస్ట్ పై అభిప్రాయానికి వచ్చారు.

ఈ విధంగా కళ్యాణ్ దేవ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారిం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube