కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో అధికారులు నిర్వాకం బయటపడింది.సుమారు 150 మంది విద్యార్థులను అధికారులు సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వలేదని తెలుస్తోంది.
విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరించారని సమాచారం.ఈ క్రమంలో హజరు తక్కువ ఉన్న విద్యార్థులను ఇంటికి పంపారని తెలుస్తోంది.
దీంతో బాధిత విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి తమ పిల్లల చదువులు దెబ్బతినకుండా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు.







