2004 నుంచి 2014 వరకు అవినీతి దశాబ్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.2004-2014 మధ్య ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని తెలిపారు.
యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయని మోదీ ఆరోపించారు.అవినీతిపై మేం పోరాటం చేస్తుంటే ప్రతిపక్షాలు తమపై పోరాటం చేస్తున్నాయని తెలిపారు.అవినీతిపై విచారణ చేస్తే దర్యాప్తు సంస్థలపై ఆరోపణలా అని ప్రశ్నించారు.ఎన్నికల్లో ఓడిపోతే ఈసీపై ఆరోపణలు చేస్తారని విమర్శించారు.
తొమ్మిదేళ్లుగా ప్రభుత్వాన్ని విమర్శించడమే వీళ్ల పనంటూ ఎద్దేవా చేశారు.సవాళ్లను ఎదుర్కొనే శక్తి విపక్షాలకు లేదని స్పష్టం చేశారు.