నెల్లూరు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి ప్రెస్ మీట్తన స్నేహితుడు రామశివారెడ్డితో మాట్లాడిన ఆడియోని బయటపెట్టిన కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ ఆడియోని ఇంటిలిజెన్స్ డిజి రామాంజనేయులు తనకి పంపించారని కోటంరెడ్డి ఆరోపణ అది ఫోన్ ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అన్న వైసీపీ అధిష్టానం, మంత్రులు కీలకంగా మారిన రామశివారెడ్డి కామెంట్స్.గతంలో కాంగ్రెస్ లో, వైసీపీ తో రాజకీయంగా సంబంధం 15 ఏళ్లుగా ఎమ్మెల్యే కోటంరెడ్డికి నాకు అనుబంధం ఉంది రాజకీయాలు వదిలి కాంట్రాక్టు ఫీల్డ్ లో సెటిల్ అయ్యాను జగన్ దగ్గర బీఫామ్ తీస్కుని విజయం సాధించగా సంతోషించాను అనేక సార్లు ఫోన్లో మాట్లాడాను, మా ఇంటికి వచ్చేవారు 30 ఏళ్లుగా నేను రాజశేఖర్ రెడ్డి గారితో నడిచాను డిసెంబర్ లో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఛానెల్స్ లో, యు ట్యూబ్ లో చూసాను అదే రోజు రాత్రి 8 గంటలకి నాకు ఎమ్మెల్యే కాల్ చేశారు రావత్ గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది అని సలహా ఇచ్చాను.
ఒక కాంట్రాక్టర్ విషయంలో సుదీర్ఘంగా నాతో మాట్లాడారు, ఆ కాంట్రాక్టర్ వ్యవహారంలో ఆయనతో మాట్లాడాను నా ఫోన్ లో ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది, ఆ రోజు కూడా రికార్డ్ అయ్యింది నా ఫోన్ లో ఉన్న కాంట్రాక్టర్ విషయంపై రికార్డింగ్ ని స్నేహితుల వద్ద యాదృచ్చికంగా వినిపించాను రాష్ట్ర ప్రభుత్వంపై ఇంత ఆరోపణలు వస్తాయని నేను ఊహించలేదు కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాను అని ఎమ్మెల్యే చెప్పారు దీనిపై నాకు ఆందోళన కలిగింది, చిన్న విషయంపై రాష్ట్రంలో ఇంత ఆందోళన నన్ను కలిచివేసింది వైఎస్సార్ పై దుష్ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు