హన్సిక లవ్ షాది డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస తెలుగు సినిమాలలో నటించి సందడి చేశారు.

 Hansika Love Shaadi Drama Streaming Date Fix When ,hansika ,love Shaadi Drama ,-TeluguStop.com

ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.తన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహమాడారు.

ఇలా మీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Telugu Actress Hansika, Palace, Sohail Kathuria, Disney Hot, Hansika, Hansikalov

హన్సిక వివాహం జైపూర్ లోని పురాతన ప్యాలెస్ లో ఎంతో వైభవంగా జరిగింది.అయితే వీరి వివాహ వేడుకను ప్రముఖ ఓటీటీ సమస్థ భారీ ధరలకు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇదే విషయాన్ని హన్సిక కూడా వెల్లడించారు.

తాజాగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు.లవ్ షాది డ్రామా పేరుతో వీరి వివాహ వేడుక విడుదల కానుంది.

ఈ ట్రైలర్ కనుక చూస్తే హన్సిక సోహెల్ తో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు ఇన్ని రోజులు తన చుట్టూ తిరిగిన ఇతనేనా నా లైఫ్ పార్ట్నర్ అనిపించిందని ఈమె తెలిపారు.

Telugu Actress Hansika, Palace, Sohail Kathuria, Disney Hot, Hansika, Hansikalov

సోహెల్ చాలా ఎమోషనల్ పర్సన్ అని తనని పెళ్లి చేసుకోవడం కోసం ఈమె తన కుటుంబ సభ్యులతో చేసిన పోరాటం గురించి కూడా తెలియజేశారు.ఆమె జీవితంలో జరిగినటువంటి ఎమోషనల్ జర్నీ లవ్ షాది డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుందని వెల్లడించారు.ఈ క్రమంలోనే హన్సిక షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube