వంటకాల్లో అతి ముఖ్యంగా వాడే పదార్థం ఏమైనా ఉందంటే అది కొత్తిమీర అని చెప్పవచ్చు.దీన్ని ఎక్కువగా కూరల్లో గార్నిషింగ్ కి వాడుతూ ఉంటారు.
అయితే కొత్తిమీర లేనిదే ఏ కూర కూడా టేస్టీగా ఉండదని చెప్పాలి.అయితే ఇది కేవలం గార్నిషింగ్ కోసం టేస్ట్ కోసం మాత్రమే అని అనుకుంటే తప్పు.
కొత్తిమీర తినడం వల్ల టేస్ట్ తో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.అయితే కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా సహాయపడుతుంది.
అలాగే టైప్ టు డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజు కొత్తిమీరను తింటే చాలా మేలు.
కొత్తిమీర ఆకులు తిన్న లేక ధనియాలు తిన్న కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.అదే విధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కొత్తిమీర తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.మెడ అడుగు భాగంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధి జీవక్రియలను అలాగే ఎదుగుదలను నియంత్రించే హార్మోన్లలో ఇది బాధ్యతను తీసుకుంటుంది.
ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది.శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం లాంటి సమస్యలు వస్తాయి.
థైరాయిడ్ వస్తే నీరసం, మలబద్ధకం, చలిని తట్టుకోలేకపోవడం, డిప్రెషన్, బరువు పెరగడం లాంటివి జరుగుతాయి.
అయితే ఈ వ్యాధిని అడ్డుకునే శక్తి కొత్తిమీరకు ఉంది.థైరాయిడ్ ఉన్నవారు కొత్తిమీరని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.కొత్తిమీర ఆకులు లేక ధనియాలు తింటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండింటిని కూడా నిర్వహించవచ్చు.
ఎందుకంటే కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.
అలాగే ధనియాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.అలాగే బరువు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
అయితే కొత్తిమీర చట్నీ రూపంలో, కూర రూపంలో లేదా అన్నంలో కలిపి వండుకొని తింటే చాలా మంచిది.అలాగే కొత్తిమీర నీటిని తయారు చేసుకొని కూడా తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే థైరాయిడ్ అదుపులో ఉంటుంది.