సాధారణంగా ఏనుగుని చాలా వరకు సాధు జంతువు అని సంబోధిస్తూ వుంటారు.అయితే నేను సాధు జంతువుని కాదు, అవకాశమిస్తే మీ బొక్కలు ఇరగదీసే క్రూర మృగాన్ని కూడా అని నిరూపించిందొక గజరాజు.
అవును, సోషల్ మీడియా వినియోగం విరిగా పెరిగాక రకరకాల కంటెంట్ మనకు వీడియోల రూపంలో దర్శనం ఇస్తోంది.అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి, ఇంకొన్ని జూపుప్సాకరంగా, మరి కొన్ని ఒకింత భయానకంగా ఉంటాయి.
ప్రస్తుతం ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో మాత్రం కాస్త భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు.
సాధారణంగా అడవి జంతువులను చూడాలని ఆశపడేవారు ఏ జూ కో వెళుతుంటారు.ఎందుకంటే అక్కడ తగినంత సేఫ్టీ ఉంటుంది, పైగా అక్కడి జంతువులకి మనుషులపైన దాడి చేసే అవకాశం ఉండదు.అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం సరాసరి అడవుల్లోకి నేరుగా వెళ్ళి, వాటితో ఫోటోలు దిగాలని ఆశపడుతూ వుంటారు.
ఇలాంటి సందర్భాలలో కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి.తాము ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తెలుస్తుంది అన్న మాదిరి వ్యవహారాలు అక్కడ జరుగుతూ ఉంటాయి.ఇలా సందర్శకులపై అడవి జంతువులు అరుదుగా దాడి చేస్తుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే, ఓక టూరిస్ట్ అడవిలో రైడ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఏనుగు మామని ఫోటోలు తీద్దామని తెగ ట్రై చేస్తున్నాడు.మరి అలా ఫొటోలు, వీడియోలు తీయడం సదరు గజరాజుకి ససేమిరా నచ్చలేదు.దాంతో కోపంతో ఊగిపోతూ వాహనం వెనుక వారిని స్పీడుగా వెంబడించింది.దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అతగాడు బతుకుజీవుడా అనుకొని అక్కడి నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని స్పీడుగా వెనక్కి రివర్స్ చేసాడు.
వాహనం కాస్త నెమ్మదైతే ఏనుగు వారిపై ఖచ్చితంగా దాడిచేసేదే.అయితే డ్రైవర్ వాహనం వేగాన్ని పెంచి జంతువు దాడి నుంచి తమని తాము కాపాడుకున్నారు.