మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఫోటోస్ మార్ఫింగ్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీబీఐటీ కాలేజీ విద్యార్థినీల డీపీలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మార్ఫింగ్ ఫొటోలు చూపించి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.అదేవిధంగా సైబర్ సెప్టీపై మహిళలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.