టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు దర్శకుడిగా సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు అభిమానులకు మంచి మాటలను చెబుతూ ఉంటాడు.
ఈ క్రమంలోని ప్యూరీ మ్యూజింగ్స్ పేరుతో ఇప్పటికే ఎన్నో అంశాల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోని తాజాగా స్టాఫ్ హ్యూమన్స్ అనే అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పూరీ జగన్నాథ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మనిషి పుట్టి ఇప్పటికి రెండు లక్షల సంవత్సరాలు అయ్యింది.
మానవజాతి పెరుగుతూ వచ్చి 8 బిలియన్లు దాటింది.రోజు 4 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు.
బర్త్ డే సమానంగా లేదు.చావు రేటు తక్కువగా ఉంటే పుట్టుకలు ఎక్కువ అయిపోయాయి.దాంతో మనుషుల వల్ల సగం ప్రకృతి నాశనం అవుతోంది.ఇప్పటికే అడవులు అన్నీ మంట కలిసిపోయాయి.ఏడాది మనం తిండి కోసం 80 బిలియన్ల జంతువులను చంపుతున్నాం.1970 తర్వాత 60% జంతువులు అంతరించిపోయాయి.మనుషులు వేటిని బతకనీయడం లేదు.దానికి తోడు మనుషులు పిల్లల్ని పుట్టించడంలో బిజీగా ఉన్నారు.ఇది తప్పు ఎందుకంటే మానవజాతి ఆగాల్సిన సమయం వచ్చింది.ఆగకపోతే మనం ఆపలేం.1971లో లెస్యూ నైట్ అనే ఒక సామాజిక ఉద్యమకారుడు వాలంటరీ హ్యూమన్ ఎక్సిటిన్షన్ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.
ఈ భూగ్రహాన్ని కాపాడాలి అంటే మానవజాతి అంతరించిపోవాలి అది ఒక్కటే సమాధానం అని తెలిపారు పూరి జగన్నాథ్.అందుకోసం మనం చనిపోవాల్సిన అవసరం లేదు పెళ్లిళ్లు చేసుకోవడం మానేయండి ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనవద్దు.ముందుగా నా పిల్లలు నా వంశం అన్న ఆలోచనల నుంచి బయటపడాలి అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.
కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మానవ జాతిని కాపాడండి అని తెలిపారు పూరి జగన్నాథ్.ఇకపోతే పూరి జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.