సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ప్రేక్షకులకు దగ్గరైన వాళ్లలో చలపతిరావు ఒకరు.అయితే ఒక సంఘటన చలపతిరావును ఎంతగానో బాధ పెట్టింది.
రారండోయ్ వేడుక చూద్దాం ఈవెంట్ లో అమ్మాయిలు హానికరమా అనే కామెంట్ కు చలపతిరావు స్పందిస్తూ అమ్మాయిలు హానికరం కాదు.పక్కలోకి పనికొస్తారు అని చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది.
ఈ కామెంట్ విషయంలో చలపతిరావుపై ఎంతోమంది విమర్శలు చేశారు.ఆయన పొరపాటున నోరు జారి చేసిన కామెంట్లు కెరీర్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.ఈ ఘటన తర్వాత ఆయన మూవీ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.చలపతిరావు గతంలో పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా ఈ ఘటన తర్వాత ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉన్నారు.
ఈ ఘటన వల్ల ఆయనకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు.తను చాదస్తంతో చేసే కామెంట్ల వల్ల ఈ స్థాయిలో రచ్చ జరుగుతుందని ఆయన అనుకోలేదని ఆయన సన్నిహితులు ఇప్పటికీ చెబుతారు.
ఈ ఘటన వల్ల ఆయనకు సినిమా ఆఫర్లు కూడా ఒకింత తగ్గాయి.చలపతిరావు భయపెట్టే విలన్ రోల్స్ లో నటించడంతో పాటు నవ్వించే బాబాయ్ పాత్రలలో కూడా అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం.
మూడు తరాల హీరోలతో నటించిన అతికొద్ది మంది నటులలో చలపతిరావు కూడా ఒకరు కావడం గమనార్హం.హిందీ, తమిళ భాషల్లోని సినిమాలలో కూడా చలపతిరావు నటించారు.తన పాత్రలతో ఎన్నో సినిమాల విజయంలో చలపతిరావు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రీల్ లైఫ్ లో చలపతిరావు చేసిన పాత్రలకు ఆయన రియల్ లైఫ్ కు ఏ మాత్రం పొంతన ఉండేది కాదని చాలామంది చెబుతారు.
చలపతిరావు భౌతికంగా దూరమైనా అభిమానుల హృదయాలలో మాత్రం జీవించే ఉన్నారు.