Christmas 22: మన ఇండియాలో కొలువైన పురాతనమైన, అందమైన చర్చిలు ఎక్కడున్నాయంటే?

క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇంకా మూడు రోజులే మిగిలి వుంది.ఈసారి సరిగ్గా ఆదివారం పడింది.

 Christmas 22 Where Are The Most Ancient And Beautiful Churches In Our India-TeluguStop.com

దాంతో క్రిస్టియన్స్ మంచి ఖుషిగా వున్నారు.ఈ సందర్భంగా స్థానికంగా ఉండే చర్చిలు బాగా ముస్తాబు అవుతున్నాయి.

ప్రతి సంవత్సరం ఇతర దేశాలలో ఎంత హాట్టహాసంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారో ఇండియాలో కూడా అదేమాదిరి పండగ చేసుకుంటారు.అయితే కొంతమంది స్థానిక చర్చిలకు వెళితే, మరికొంతమంది ఇతర ప్రాంతాలలో వున్న చర్చిలకు వెళుతూ వుంటారు.

ఇక మనదేశంలో చూసుకుంటే కొన్ని చెప్పుకోదగ్గ చర్చిలను చూడవచ్చు.అందులో ముందుగా చెప్పుకోదగ్గది బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి గోవా.ఈ చర్చి భారతదేశంలో వున్న ప్రధాన చర్చిలలో ఒకటి.ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిది.

దీనితో పాటూ గోవాలో సే కేథడ్రల్, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి సహా ఎన్నో పురాతన చర్చిలు ఇక్కడ సందర్శించవచ్చు.ఆ తరువాత సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిని చెప్పుకోవచ్చు.

ఇది భారతదేశంలో కొలువైన మొదటి యూరోపియన్ చర్చి.దీనిని 1503లో కొచ్చిలో నిర్మించారు.

Telugu Basilicabom, Christmas, Hindu, Indian, Latest, Sacredheart, Saint Francis

ఇక ఆ తరువాతి లిస్టులో వున్నది ఆల్ సెయింట్స్ కేథడ్రల్ చర్చ్… ఇది అలహాబాద్‌లోని కొలువై వున్న రాతి చర్చి.ఇది 1870లో సర్ విలియం ఎమర్సన్ కట్టించారు.తరువాత చెప్పుకోదగ్గది సెయింట్ లూక్స్ చర్చి కాశ్మీర్… ఈ చర్చి కాశ్మీర్‌లో శంకరాచార్య కొండ దిగువన కలదు.1896న లాహోర్ బిషప్ దీనిని ప్రజలకు అంకితం చేశారు.అలాగే దిల్లీలోని పురాతన చర్చిల్లో సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ ఢిల్లీ ఒకటి.ఈ రోమన్ క్యాథలిక్ చర్చి 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఆ తరువాత క్రైస్ట్ చర్చ్ సిమ్లాని చెప్పుకోవచ్చు.ఈ చర్చి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో కలదు.

ఇవేకాకుండా మరెన్నో అందమైన చర్చిలకు భరత్ నిలయం.ఇంకెందుకాలస్యం ఈ క్రిస్మస్ పండగకు ఎక్కడికి వెళతారో ప్లాన్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube