ఉపాసన గర్భవతి అయ్యారనే వార్త ప్రచారంలోకి వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియాలో చరణ్ ఉపాసనలకు ఎంతోమంది శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
పెళ్లైన పదేళ్ల తర్వాత చరణ్ ఉపాసన తల్లీదండ్రులు అవుతున్నట్టు ప్రకటించడంతో చరణ్ తో పని చేసిన ఇతర భాషల సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు చెబుతుండటం గమనార్హం.
అయితే చరణ్ ఉపాసనలకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఏ పేరు పెట్టాలనే టెన్షన్ అవసరం లేకుండా ఇప్పటికే పేర్లను ఫిక్స్ చేశారని సమాచారం.
చరణ్ ఉపాసనలకు కొడుకు పుడితే అంజన్ తేజ్ అని కూతురు పుడితే మాత్రం అంజనీ అనే పేరు పెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.చిరంజీవి ఈ పేర్లను ఫిక్స్ చేశారని బోగట్టా.
హనుమంతుని భక్తుడు అయిన చిరంజీవి ఆ దేవునిపై ఉన్న భక్తి వల్లే ఈ పేర్లు ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఈ పేర్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
చిరంజీవి ఫ్యామిలీ పేర్ల చివరన సాధారణంగా తేజ్ అని ఉంటుంది.అందువల్ల మనవడు పుడితే అంజన్ తేజ్ అని పెట్టాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పేర్లు మాత్రం బాగున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.
ఈ రెండు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా చరణ్ సైతం ఈ సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య మూవీ దర్శకనిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ఆ తప్పు జరగకూడదని రామ్ చరణ్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.