నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు కంటే ఎక్కువ అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూట్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది.
ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.
మరొక పక్క సాంగ్ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేయగా.మరో పాట డిసెంబర్ 15న రాబోతున్నట్టు తెలిపారు.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా రెండు గంటల నలబై మూడు నిముషాల రన్ టైం తో ఉండబోతుందట.
ఇది భారీ రన్ టైం అనే చెప్పాలి.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించ నున్నారు.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న రిలీజ్ కాబోతుంది.సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.