మళ్లీ ఎప్పటి తంతే ! కాంగ్రెస్ లో ఎప్పుడూ ఇంతే 

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మార్పు వస్తుందని, అధికారాన్ని సాధించాలనే కసి వారిలో కనిపిస్తుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎప్పటికప్పుడు భావిస్తున్న, ఆ మార్పు అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటికీ అధికారంలోకి వచ్చేలాగా కనిపించడం లేదు.పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న తపన కంటే తామకు పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని,  అధిష్టానం వద్ద తమ మాట చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తితో సొంత పార్టీపైనే విమర్శలు చేసే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది.

 As Always It Is Always The Same In Congress ,telangana Congress, Congress, Trs,-TeluguStop.com

తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు జనాలు బ్రహ్మరథం పట్టాల్సి ఉన్నా,  ఆ క్రెడిట్ సాధించడంలోనూ ఆ పార్టీ విఫలమైంది.

ఫలితంగానే టిఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది.

గ్రూపు రాజకీయాలను చక్కదిద్దుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుండడంతోనే , అధికారం కి దూరం అవుతూ వస్తోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన దగ్గర నుంచి కాంగ్రెస్ సీనియర్లు అలక చెందుతూనే ఉన్నారు.

  ఆయనకు ఆ పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండడం మిగిలిన నేతలకు మింగుడు పడటం లేదు.ఇది ఇలా ఉండగానే తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ కొత్త కమిటీలలో తమకు ప్రాధాన్యం దక్కలేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా,  సీనియర్ నేతగా తనకు గౌరవం దక్కలేదని అసంతృప్తితో మాజీ మంత్రి కొండ సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టుకు రాజీనామా చేసే ఆలోచనలో పడ్డారు.
 

Telugu Aicc, Congress, Revanth Reddy, Telangana-Political

ఆమె కాదు చాలామంది సీనియర్ నాయకులు ఈ కమిటీల నియామకం విషయంలో అసంతృప్తితో ఉన్నారు.ఇప్పటికే చాలామంది గాంధీభవన్ తొక్కడం లేదు.మరి కొంతమంది రేవంత్ పై ఉన్న ఆగ్రహంతో ఆయన పాల్గొనే సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు.ఈ సమయంలోనే కొత్త కమిటీల ప్రకటన నేతలందరినీ ఏక తాటి పైకి తీసుకురాకపోగా,  ఇప్పుడు మరింత విభేదాలకు కారణమైంది.

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ( బీ ఆర్ ఎస్ ) బిజెపి మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది.ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండగా,  కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారిపోయింది  ఈ క్రమంలో పార్టీని అధికారం వైపు తీసుకు వెళ్ళేందుకు పార్టీ నాయకులంతా ఉమ్మడిగా పనిచేయాల్సి ఉన్న,  ఈ విధంగా పదవులు,  ప్రాధాన్యం అనే అసంతృప్తితో  ఉండడం తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే కనిపిస్తోంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న పార్టీలో అంతర్గత విభేదాలు చల్లారకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube