సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న తారక రామ సినీ ఫ్లెక్స్.. బాలయ్య చేతుల మీదుగా రీ ఓపెన్!

హైదరాబాద్ కాచిగూడలో ఉన్నటువంటి తారక రామ థియేటర్ మూత పడిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ థియేటర్ ను పునరుద్ధరించడానికి గత కొద్దిరోజులుగా మరమ్మత్తులను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Taraka Rama Cine Flex Which Has Been Shaped With A New Touch Re Opened By The Ha-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ థియేటర్ సరికొత్త హంగులతో, అత్యధిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంది.ఇక ఈ థియేటర్ డిసెంబర్ 14వ తేదీ నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా రీ ఓపెన్ కానుంది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మీద ఉన్న అభిమానంతో నారాయణ కె దాస్ నారంగ్ ఈ థియేటర్ ను తిరిగి పున ప్రారంభించాలని భావించారు.

ఈ క్రమంలోనే నారాయణ కె దాస్ నారంగ్ తారక రామారావు థియేటర్ ను పునరుద్ధరించడానికి ఏషియన్స్ వారితో కలిసి పునరుద్ధరించి ఈ థియేటర్ కి ఏషియన్స్ తారక రామారావు కాంప్లెక్స్ అనే పేరు పెట్టారు.నారాయణ కే దాస్ కుమారులైనటువంటి సునీల్ నారంగ్, భగత్ నారంగ్ సరికొత్త 4k టెక్నాలజీతో థియేటర్ ను రూపుదిద్దారు.4k ప్రొజెక్టర్, సుపీరియర్ సౌండ్ సిస్టం, సీటింగ్ లక్సరీ చేస్తూ రిక్లైనర్ సోఫాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Telugu Balayya, Cine Flex, Taraka Rama-Movie

ఈ విధంగా ప్రేక్షకులకు అన్ని వసతులను కల్పిస్తూ ఎంతో సౌకర్యవంతంగా సరికొత్త టెక్నాలజీ ద్వారా ఈ థియేటర్ ను ఎంతో సుందరవదనంగా తీర్చిదిద్దారు.గతంలో ఈ థియేటర్లో 975 సీట్లు ఉండగా ప్రస్తుతం పునరుద్ధరించిన అనంతరం 590 సీట్లను అందుబాటులోకి వచ్చారు.ఇక డిసెంబర్ 14వ తేదీ ఈ థియేటర్ బాలకృష్ణ చేతుల మీదుగా రీ ఓపెన్ కానుంది.ఇక 16వ తేదీ నుంచి ఈ థియేటర్లో అవతార్ 2 సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఏషియన్స్ వారు హైదరాబాద్లో పలువురు హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఏషియన్స్ తారక రామారావు పేరుతో మరో మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube