మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇకపోతే చిరంజీవి తన తదుపరి చిత్రం బాబి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తిచేసుకునే పనిలో చిత్ర బృందం నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో రెండు పాటలు చిత్రీకరణ ఉండడంతో ఈ పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం యూరప్ వెళ్లారు.
అక్కడ అందమైన లోకేషన్లో ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ జరగనుంది.పర్యటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంతో కాకుండా తన ఫ్యామిలీతో కూడా వెళ్లారు.ఈ యూరప్ పర్యటనలో భాగంగా తన భార్య సురేఖతోపాటు తన పెద్ద కుమార్తె సుస్మిత అలాగే తన మనవరాళ్లతో కలిసి చిరంజీవి యూరప్ వెకేషన్ వెళ్లారు.
వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ తో పాటు కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర ముగించుకొనున్నారు.ఈ క్రమంలోనే చిరంజీవి యూరప్ పర్యటనకు సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి కాగా మరొకటి హీరోయిన్ శృతిహాసన్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.