తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 13 వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుని 14 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.కాగా మరొక వారంలో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే చేరుకోబోతోంది.
దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ 14 వారం ఏ ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటినుంచి ఎంటర్టైన్మెంట్ లేదు ఈసారి ఎపిసోడ్ చాలా వరెస్ట్ గా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే చివరి వారాలు కూడా చప్పగా సాగుతుండడంతో బిగ్ బాస్ షో నిర్వాహకుల పై మండిపడుతున్నారు నెటిజన్స్.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్న విషయం తెలిసిందే.
వీరిలో ఇద్దరు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా మిగిలిన ఐదుగురు టాప్ 5 లోకి వెళ్ళనున్నారు.అయితే ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్ లలో శ్రీ సత్య, కీర్తి లు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగా తెలుస్తోంది.
అలాగే టాప్ లోకి నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి వెళ్లే ఛాన్స్ కనబడుతుంది.శ్రీ సత్య, కీర్తి లు మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.
మరొక లేడీ కంటెస్టెంట్ ఇనయ టాప్ ఫైవ్ లో కచ్చితంగా నిలుస్తుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.రేవంత్ అందరికన్నా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే తర్వాత రోహిత్, ఆ తర్వాత శ్రీహన్ క్రేజీగా కనబడుతున్నారు.
ఇప్పటికే శ్రీహన్ కి టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ అయ్యింది.
కానీ అతను మూడో స్థానానికే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.నాలుగో ప్లేస్ లో ఇనయ, ఐదో స్థానంలో ఆది రెడ్డి ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే శ్రీ సత్యని టాప్ 5 లో ఉంచడం కోసం ఆదిరెడ్డిని బలి చేస్తూ అతన్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.టాప్5 లో రేవంత్, రోహిత్, శ్రీహన్, ఇనయ కన్ ఫర్మ్ గా ఉంటారని కానీ ఐదో ప్లేస్ లో శ్రీ సత్య ఆది రెడ్డి మధ్యన టఫ్ ఫైట్ జరగొచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇక శ్రీ సత్య, ఆదిరెడ్డి లలో ఎవరో ఒకరితోపాటు కీర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.