అనంతపురం జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది.శింగనమల కస్తూర్బా గురుకుల స్కూల్ లో సుమారు 40 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
వెంటనే స్పందించిన సిబ్బంది బాధిత విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు.సమాచారం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందన్నారు.ఘటనపై కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.