Lovers Bike: లవర్‌ను బైక్ ఎక్కించుకుని స్టంట్లు చేశాడు.. చివరికి బొక్కబోర్లా పడ్డాడు

ఈ రోజుల్లో యువకులకు ఎవరికైనా బైకులు ఉంటే ఖాళీగా ఉండరు.వాటిపై రయ్ రయ్‌మంటూ రోడ్లపై వేగంగా దూసుకుపోతారు.

 He Took The Lover On A Bike And Did Stunts In The End , Lovers, Bike, Stuns,-TeluguStop.com

అందులోనూ అమ్మాయిలు ఉంటే ఇక వారి వేగానికి బ్రేకులు ఉండవు.ముందు చక్రం గాలిలో లేపి, కొత్త కొత్త స్టంట్లు చేస్తుంటారు.

ఒక్కోసారి అవి వారికి చెప్పలేనంత థ్రిల్ ఇస్తాయి.ఈ థ్రిల్ కోసం వారు ఏకంగా ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటారు.

అమ్మాయిలకు లైన్ వేసేందుకు ఇంతలా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.ఇక ఏ అమ్మాయి అయిన తమ బైక్ ఎక్కితే వారి హుషారు మామూలుగా ఉండదు.

ఇదే కోవలో ఓ వ్యక్తి తన బైకుపై అమ్మాయిని ఎక్కించుకుని ఫీట్లు చేశాడు.చివరికి అది బెడిసికొట్టింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు చాలా మంది యువకులు చాలా రకాలుగా కష్టపడుతుంటారు.ఏ మాత్రం అమ్మాయి వీరి లవ్‌లో పడితే వారి ఆనందానికి హద్దులు ఉండవు.బైకుపై ఎక్కించుకుని ఊరంతా షికార్లు చేస్తుంటారు.

అయితే ఇటీవల కాలంలో యువకులకు బైక్ రైడింగ్ అంటే చాలా మోజులో ఉన్నారు.ఏదైనా రహదారి వద్ద కొందరు యువకులు ఈ బైక్ రైడ్స్ పోటీలు పెట్టుకుంటున్నారు.

అందులో కొందరు తమ బైక్ వెనుకాల అమ్మాయిని ఎక్కించుకుని పోటీల్లో పాల్గొంటున్నారు.ఇదే తరహాలో ఓ యువకుడు తన బైక్‌పై అమ్మాయిని ఎక్కించుకుని, చాలా స్టైల్‌గా బైక్ నడిపాడు.

హ్యాండిల్ పట్టుకుని బైక‌ను పాము తరహాలో అటూ ఇటూ తిప్పుతూ వయ్యారంగా బైక్ రైడింగ్ చేశాడు.అయితే అతడి ఫీట్లు బెడిసికొట్టి రోడ్డుపై ఓ చోట బోర్లా పడ్డాడు.

దీంతో బైక్ పై నుంచి తన లవర్‌తో సహా ఆ యువకుడు పడిపోయాడు.అతడు వేసుకున్న టీ షర్టు కూడా చిరిగిపోయి ముక్కలైపోయింది.

ఈ వీడియోను క్యాబ్రేజ్ 228 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది.అమ్మాయిల కోసం ఇలా బైక్ స్టంట్లు చేసి, ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube