కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముద్దనూరు బైపాస్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.పలువురు గాయపడినట్లు సమాచారం.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.