గాలోడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో కనిపించిన సంగతి తెలిసిందే.స్కిట్ లో సుధీర్ హీరో పాత్రలో రామ్ ప్రసాద్ డైరెక్టర్ పాత్రలో రష్మీ హీరోయిన్ పాత్రలో కనిపించారు.
గెటప్ శ్రీను స్కిట్ లో భాగంగా వదిలేసి అక్కడెక్కడికో వెళ్లిపోతే కుదరదు అంటూ సుధీర్ ఛానెళ్ల మార్పుపై షాకింగ్ కామెంట్లు చేశారు.గెటప్ శ్రీను సుధీర్ తో మాట్లాడుతూ రాజు కథ చెప్పగా సుధీర్ గెటప్ శ్రీనుకు రివర్స్ లో అదిరిపోయే పంచ్ వేశారు.
ఆ తర్వాత రామ్ ప్రసాద్ రియల్ స్టోరీ చెబుతానని చెప్పి ఒక అడవిలో మూడు కోతులు ఉండేవని ఆ మూడు కోతులు అడవిలో చాలా చక్కగా ఉండేవని ఈ కోతుల్లోంచి ఒక కోతి సిటీలోకి వెళ్లిందని చెప్పారు.సిటీలోకి వెళ్లి తిరిగి తిరిగి మళ్లీ అడవిలోకి వచ్చిందని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కోతి కోసం ఒక ఎర్ర కోతి(రష్మీ) ఎదురుచూస్తోందని రష్మీని చూపిస్తూ రామ్ ప్రసాద్ కామెంట్లు చేశారు.
దీనిని బట్టి ఏం అర్థమైందని సుధీర్ ను అడగగా కోతులు అడవులలో ఉండటమే బెస్ట్ అని సుధీర్ చెప్పుకొచ్చారు.
ఈ స్కిట్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.సుధీర్ నటించిన గాలోడు సినిమా ప్రస్తుతం భారీ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
బీ, సీ సెంటర్లలో గాలోడు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు భావిస్తున్నారు.గాలోడు సినిమాకు సుడిగాలి సుధీర్ 50 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది.గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ కు భారీ బ్లాక్ బస్టర్ దక్కుతుందని అందరూ భావించగా ఈ సినిమాకు ఆశించిన టాక్ రాకపోవడం గమనార్హం.