Anchor Rashmi : అందాలను దాచేస్తున్న యాంకర్ రష్మీ.. ఇక ఎక్సపోజింగ్ అవసరం లేదనుకుందా?

టాలీవుడ్ బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన బ్యూటీ రష్మి గౌతమ్.తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తన అందాలతో కూడా కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక ఈ బ్యూటీ తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది.కానీ అప్పుడు రష్మీ అంటే ఎవరికి తెలియదు.కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పుడే అందరి దృష్టిలో పడింది.

 Anchor Rashmi Hides Her Beauty Do You Think There Is No Need For Exposing Anymor-TeluguStop.com

ఈ షో ఆమె కెరీర్ కు మలుపు తిప్పింది.ఈ షోలో అడుగుపెట్టాకే రష్మీకి ఒక గుర్తింపు అనేది వచ్చింది.

అంతేకాకుండా ఆ షోలో మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఎంత సందడి చేసిందో చూశాం.ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న జంట పక్షుల్లాగా చేశారు.

ఓసారి మళ్లీ మళ్లీ వేదికపై వీరికి వివాహం కూడా చేశారు.ఇదంతా షో రేటింగ్ కోసం మాత్రమే చేశారని అర్థమైంది.

కానీ తమ అభిమానులు మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటే బాగుండు అన్నట్లుగా ఉన్నారు.కానీ ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు.

జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమైన ఢీ డాన్స్ షోలో కూడా రష్మీ టీం లీడర్ గా పనిచేసింది.అక్కడ కూడా సుధీర్ తో బాగా సందడి చేసింది.ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతూనే ఉంది.ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా కొనసాగుతుంది.అక్కడ కూడా యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక ఏదైనా ఈవెంట్ ఉంటే చాలు ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తన డాన్స్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తుంది.రష్మీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా కనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పంపించడమే కాకుండా.సమాజంలో జరిగే విషయాల గురించి కూడా బాగా పట్టించుకుంటుంది.

అంతేకాకుండా జంతువుల పట్ల తాను చూపించే ప్రేమ మాత్రం బాగా ఎమోషనల్ గా కనిపిస్తుంది.ఏదైనా మూగ జీవికి ఏమైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది.కొన్నిసార్లు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.గతంలో ఎన్నో మూగజీవుల స్టోరీలను పంచుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుందిఅంత గొప్ప మనసున్న రష్మీ.

ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలని చేస్తుంది.

అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ అందులో తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తన స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఏ మాత్రం షో చేయకుండా తన అందాలను దాచేస్తూ కనిపించింది.

దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్.రష్మీ ఇక ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube