Airtel New Plan : ఎయిర్‌టెల్ యూజర్స్‌కి శుభవార్త.. రూ.199కే 30 రోజుల వ్యాలిడిటీ..!

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తాజాగా రూ.199లకే 30 రోజుల ప్లాన్ ప్రారంభించింది.ఈ ప్లాన్ నెల మొత్తానికి 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్‌ని ఆఫర్ చేస్తుంది.30 రోజుల వ్యాలిడిటీ కోరుకునే యూజర్స్‌ కోసం ఈ ప్లాన్‌ని ఎయిర్‌టెల్ పరిచయం చేసింది.రూ.199 ధరతో రీఛార్జి ప్లాన్ తీసుకురావడం కొత్తేమీ కాదు.2021లో ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 24 రోజుల వ్యాలిడిటీతో అందించింది.2021 వరకు రూ.199 ప్లాన్‌ రోజువారీ డేటాగా 1 జీబీ డేటాని అందించేది.దాని తరువాత ఈ ప్లాన్‌లో మార్పులు చేసింది.

 Good News For Airtel Users.. 30 Days Validity For Rs.199, Airtel, Airtel New Pla-TeluguStop.com

రిలయన్స్ జియోలో కూడా డైలీ 1.5 GB డేటాతో ప్రస్తుతం రూ.199 ప్లాన్‌ను ఆఫర్ చేసింది.ఇది డైలీ 100 ఎస్ఎంఎస్‌ అందిస్తుంది.కాకపోతే ఈ ప్లాన్ కేవలం 23 రోజులకు మాత్రమే.కాగా ఎయిర్‌టెల్ తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ రోజులకి పొడిగించింది, కానీ డైలీ డేటా పరిమితిని తగ్గించింది.ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు, మొత్తం 3జీబీ డేటాని అందిస్తుంది.ఉచిత హలో ట్యూన్, వింక్ మ్యూజిక్ బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తుంది.3జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌ అయిపోయాక ఎయిర్‌టెల్ ప్రతి ఎంబీకి 50పైసా, ఒక్కో లోకల్ ఎస్ఎంఎస్‌కి రూ.1..ప్రతి STD ఎస్ఎంఎస్‌కి రూ.1.5 వసూల్‌ చేస్తుంది.

Telugu Airtel, Rc-Latest News - Telugu

ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ సిమ్‌గా వాడుకునేవారికి, ఎక్కువ డేటాని వాడకుండా కేవలం కాల్స్ మాత్రమే మాట్లాడే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.డైలీ డేటాని ఎక్కువగా వాడుకునే యూజర్స్ మాత్రం రూ.239 ప్లాన్‌కి వెళ్లవచ్చు.రూ.239 ప్లాన్‌ డైలీ 1.5 GB డేటా, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది.కానీ ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం 24 రోజులే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube