Foxconn Project X Car: ఇండియన్ మార్కెట్లోకి ఒకే వరుసలో 3 సీట్లు వుండే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్లోకి ఒకదాని తరువాత ఒకటిగా ఎలక్ట్రానిక్ కార్లు వచ్చి చేరుతున్నాయి.ఈ క్రమంలో ఒకే వరుసలో 3 సీట్లు కలిగిన ఓ ఎలెక్ట్రిక్ వెహికల్ ని తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ప్రవేశ పెట్టింది.

 An Electric Car With 3 Seats In A Single Row For The Indian Market Details, Ind-TeluguStop.com

ఈ విషయమై తాజాగా విద్యుత్‌ వాహన కన్సార్షియం, MIH మొదటి కారును 2023లో తీసుకురానున్నట్లు తెలిపారు.ఒకే వరుసలో 3 సీట్లు ఉండే కారును ఫాక్స్‌కాన్‌ బృందం రూపొందించింది.

ఈ కారుకు ‘ప్రాజెక్ట్‌ ఎక్స్‌’ అని పేరు పెట్టడం కొసమెరుపు.

ఒకే వరుసలో 3 సీట్లు వుండడం అంటే అదేదో పెద్ద వెహికల్ అని పొరపాటు పడకండి.

ఆసియా దేశాల్లో ఒక సంతానం ఉండే కుటుంబాలకు సరిపోయేలా, అంటే చిన్న కుటుంబాల కోసం ఈ కారును తీసుకు రానుంది.కొనుగోలుదారు తనకు నచ్చే విధంగా ప్రాజెక్ట్‌ ఎక్స్‌తో వాహనాన్ని రూపొందించుకోవచ్చని MIH చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్‌ చెంగ్‌ తెలిపారు.ఇక ఈ కారు ధర అక్షరాలా 20,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16.5 లక్షలు అన్నమాట.

Telugu Battery, Foxconnelectric, Foxconn Mih, Foxconnproject, Indian, Latest-Lat

ఈ కారును తైవాన్‌తో పాటు భారత్‌, ఇండొనేషియా, ధాయ్‌లాండ్‌, జపాన్‌ వంటి దేశాల్లో విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.కరోనా కష్టకాలం తరువాత ఆయిల్స్ రేట్స్ భగ్గుమంటున్న తరుణంలో విద్యుత్ వాహనాలు మనిషికి ప్రత్యామ్నాయంగా మారాయి.దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ కంపెనీలు వాహనాలను రూపొందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే గత కొన్నేళ్లలో విద్యుత్‌ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీపై ఫాక్స్‌కాన్‌ పెట్టుబడులు పెంచుతోంది.ఇప్పటికే అమెరికా సంస్థ ఫిస్కెర్‌ ఇంక్‌, భారత సంస్థ వేదాంతాలతో ఒప్పందాలు ప్రకటించడం కొసమెరుపు.

మరెందుకాలస్యం ఇంటరెస్ట్ వున్నవారు ఇప్పుడే ఆర్డర్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube