తెలంగాణ గవర్నర్ తమిళిసైను రాష్ట్ర ప్రభుత్వం కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే కలిసేందుకు వెళ్తామని విద్యాశాఖ మంత్రితో పాటు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుపై ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం నెలకొంది.
ఇందులో భాగంగా రిక్రూట్ మెంట్ బోర్డు అంశంపై చర్చకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ లేఖ రాశారు.దీనిపై స్పందించిన ప్రభుత్వం చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.