Sami Song , Pushpa : సంచలన రికార్డు సృష్టించిన పుష్ప సామి.. సామి పాట?

క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

 Pushpa Sami Who Created A Sensational Record Sami Song , Pushpa , Sami Sami Son-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇందులో అల్లు అర్జున్ మేనరిజం పాటలు డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో రష్మిక నటించిన సామి సామి అనే పాట ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే.

ఈ పాటకు ఎంతోమంది చిన్నారుల నుంచి పెద్దల వరకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇకపోతే ఈ పాట యూట్యూబ్లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తుంది.ఇప్పటివరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో వంద మిలియన్ పైగా వ్యూస్ సంపాదించుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప2 సినిమాని సుకుమార్ భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Pushpa, Rashmika, Sami Sami, Sukumar-Movie

ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకొనుంది.ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించడంతో ఈ సినిమాని రష్యాలో కూడా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రష్యాలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం చిత్ర బృందంతో పాటు రష్యా వెళ్లనున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube