సాధారణంగా యూఏఈ ప్రభుత్వం విద్యా సాహిత్యం అలాగే కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు గోల్డెన్ వీసా ను అందిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ గోల్డెన్ వీసా ను అందుకున్న వారు వారి దేశంలో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించవచ్చు.
ఈ గోల్డెన్ వీసాకు పది నుంచి 15 సంవత్సరాల కాలం పరిమితి ఉంటుంది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఈ గోల్డ్ వీసాను ఇప్పటివరకు బాలీవుడ్ లో పలువురు హీరోలు అందుకున్నారు.
కాగా ఇటీవలే కమలహాసన్ కి కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ ను అందజేసిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా మరొక హీరో కూడా గోల్డెన్ వీసా ని అందుకున్నారు.
ఆ హీరో మరెవరో కాదు విక్రమ్.తమిళ ప్రేక్షకులు విక్రమ్ చియాన్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
తాజాగా యూఏఈ ప్రభుత్వం తమిళ హీరో విక్రమ్ కి గోల్డెన్ వీసాను ఇచ్చి గౌరవించింది.కాగా ఈ గోల్డెన్ వీసా ను టాలీవుడ్ హీరోయిన్ నటి పూర్ణ తన భర్తతో కలిసి విక్రమ్ కు అందజేసింది.
పూర్ణ ఆమె భర్త గోల్డెన్ వీసా ని విక్రమ్ కు ఇవ్వడం పై అనేక రకాల అనుమానాలు ఇష్టమవుతున్నాయి.నటి పూర్ణా భర్త షానిద్ ఆసీఫ్ అలీ. యూఏఈలో ఉన్న ప్రముఖ వ్యాపారవేతలలో ఒకరు.
ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.అయితే షానీద్ తన కంపెనీ ద్వారా హీరో విక్రమ్ కి గోల్డెన్ వీసా వచ్చే విధంగా చొరవ తీసుకోవడం వల్ల ఇది సులభం అయ్యిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే పూర్ణ,షానిద్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వారి అయిన విషయం తెలిసిందే.అంతేకాకుండా కాబోయే భార్యకు భర్త షానిద్ భారీగా బంగారం అలాగే ఆస్తులను అప్ప చెప్పినట్లు వార్తలు వినిపించాయి.