సంచలన రికార్డు సృష్టించిన పుష్ప సామి.. సామి పాట?

క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.

ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఇందులో అల్లు అర్జున్ మేనరిజం పాటలు డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో రష్మిక నటించిన సామి సామి అనే పాట ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే.

ఈ పాటకు ఎంతోమంది చిన్నారుల నుంచి పెద్దల వరకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇకపోతే ఈ పాట యూట్యూబ్లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తుంది.ఇప్పటివరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో వంద మిలియన్ పైగా వ్యూస్ సంపాదించుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప2 సినిమాని సుకుమార్ భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

"""/"/ ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకొనుంది.ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించడంతో ఈ సినిమాని రష్యాలో కూడా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రష్యాలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం చిత్ర బృందంతో పాటు రష్యా వెళ్లనున్నట్టు సమాచారం.

ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే…. ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?