ప్రముఖ జర్నలిస్ట్ TV9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ త్వరలో కొత్త టెలివిజన్ ఛానెల్‌ని ప్రారంభించినున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంబానీ గ్రూప్ సారధ్యంలో తెలుగు కొత్త ఛానెల్ రానున్నదని, దానికి రవి ప్రకాశ్ నేతృత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి.
అనుకోకుండా ఛానెల్‌పై అంబానీ గ్రూప్ వెనక్కి తగ్గినట్లు సమాచారం తాజాగా మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది.కొత్తగా తెలుగులో ఓ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో రవిప్రకాష్ డీల్ కుదుర్చుకున్నట్లు తాజా సమాచారం.
రవి ప్రకాశ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, రేవంత్ రెడ్డి తన పేరు బయటకు రాకుండా, తన నలుగురు సన్నిహితుల ద్వారా రవి ప్రకాశ్ సీఈఓగా ఈ మీడియా హౌస్‌ను ప్రారంభినున్నరట.
తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఛానెల్ నిర్వహణను తెరవెనుక పని చేయాలని రవి ప్రకాష్‌ను రేవంత్ మొదట కోరారట.
తెరవెనుక కాకుండా తాను తెరపైనే ప్రభుత్వం వైఫల్యాలను బయటపెడుతానని రెవంత్‌కు రవి ప్రకాశ్ తెలిపినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి.అన్ని కుదిరితే ఒకటి లేదా రెండు నెలల్లో ఛానెల్ ప్రారంభించబడవచ్చు సన్నిహిత వర్గాలు తెలిపాయి.కొన్ని సంవత్సరాల క్రితం TV9 ప్రమోటర్ అయిన అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ABCL) రవి ప్రకాశ్‌ను సీఈఓ పదవి నుండి తొలగించిన విషయం తెలిసిందే.
ఈ అంశం న్యాయ పోరాటం కూడా చేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగించినప్పుడు నుంచి రేవంత్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీని ఎలాగైన తెలంగాణలో అధికారంలో తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇందులో భాగంగా పార్టీకి బలమైన గొంతు ఉండాలని టీవీ ఛానల్ ప్రారంభించాలని చూస్తున్నారు.
టీఆర్ఎస్‌ను ఎదురుకోవడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు
.