చాలామంది దంత సమస్యలతో తీవ్రమైన నొప్పికి గురవుతూ ఉంటారు.ఎందుకంటే దంతాల నరాలు తలకు కనెక్ట్ అయి ఉంటాయి.
కాబట్టి దంతంలో ఎంత చిన్న నొప్పి వచ్చినా అది తీవ్రమైన నొప్పిగా అందరూ బాధపడతారు.అయితే దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి.అలాగే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకునే ఆహారాలు కూడా అంతే ముఖ్యం.
లేకపోతే పళ్ళు రంగు మారిపోవడం, అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందడం, చిగుళ్ల వ్యాధులు, దంతాక్షయం వంటి తీవ్రమైన పంటి సమస్యలు కలుగుతాయి.
దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని బలంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
అందుకే ఆహార పదార్థాలు కొన్ని తీసుకోవడం వల్ల దంతాలకు చాలా నష్టం కలుగుతుంది.అందుకే ముఖ్యంగా కొన్ని రకాల స్వీట్లు, మిఠాయిలు, క్యాండీలు దంత ఆరోగ్యానికి ప్రమాదకరం.
వీటిలో మోతాదుకు మించి యాసిడ్లు ఉంటాయి.కాబట్టి వీటిని తినడం వల్ల దంత క్షయ సమస్యలు వస్తాయి.
అలాగే ఆల్కహాల్ తాగడం కూడా దంత ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వీటిని తీసుకుంటే నోరు బాగా ఎండిపోతుందని అలాగే దంత సమస్యలకు దారితీస్తుందని సూచిస్తున్నారు.
దంతక్షయం, చిగుళ్ల వ్యాధి ఇతర నోటి ఇన్ఫెక్షన్లు ముందుగానే గుర్తుంచుకొని దానికి తగినంత చికిత్స తీసుకుంటే మంచిది లేకపోతే సమస్యలు మరింత తీవ్రంగా పెరిగిపోతాయి.ఇక సోడా కార్బోనేట్ డ్రింక్స్ కూడా దంతాలకు చాలా హానికరం.
అందుకోసం తాగిన వెంటనే బ్రెష్ చేసి నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.లేకపోతే దంతాలు రంగు మారిపోతాయి.అలాగే చాలామంది ఐస్క్రీం తినడానికి ఇష్టపడతారు.అయితే ఇది మన దంతాలకు రెండు విధాలుగా హాని చేశాయి.మొదట ఇందులో తీపి, దంతా క్షయాన్ని దారితీస్తుంది.అలాగే ఇది చల్లగా ఉండడం వల్ల దంత సెన్సిటివిటీని పెంచుతుంది.