అప్పట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు.హైదరాబాద్ లో ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది.
ఈ సందర్భంగా రాహుల్ పాదయాత్రలో రోహిత్ తల్లి రాధిక నడవడం జరిగింది.రాహుల్ ని కలిసి సంఘీభావం తెలిపింది.
అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుండి రాజ్యాంగాన్ని రక్షించాలని రాహుల్ గాంధీని ఆమె కోరడం జరిగింది.
ఇదే సమయంలో పాదయాత్రలో రోహిత్ తల్లిని రాహుల్ చాలా ఆప్యాయంగా తీసుకున్నారు.
అంతేకాకుండా ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా అప్పట్లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే.
ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడం జరిగింది.
ఈ క్రమంలో రాహుల్ తో రోహిత్ తల్లి కలిసి పాదయాత్రలో నడిచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.