కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” యాత్ర ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది.ఒకపక్క మునుగోడు ఉప ఎన్నికలు మరొక పక్క రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రజలకు పలు కీలక హామీలు ఇస్తూ ఉన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ ధర తగ్గిస్తామని గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఇంకా పోలవరం, ప్రత్యేకహోదా వంటి కీలక విషయాలపై హామీలు ఇచ్చారు.
ఇక తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రలో రైతులకు పలు హామీలు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో శుక్రవారం ఖమ్మం జిల్లాలో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జిల్లాకు చెందిన బాణాపురం డప్పు కళాకారులతో మమేకమయ్యారు.యాత్రలో వారు ప్రదర్శన ఇవ్వడంతో కళాకారులతో కలిసి రాహుల్ కూడా డప్పు కొట్టడం జరిగింది.
ఈ క్రమంలో రాహుల్ తో పాటు యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క కూడా ఉన్నారు.