ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా భార్య... సంతోషంగా ఉన్నానంటూ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దగ్గుబాటి వారసుడు రానా గురించి అందరికీ సుపరిచితమే.లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Rana Wife Miheeka News Of Pregnancy Comments Details, Rana's Wife , Rana Dagguba-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన కెరియర్ పరంగా సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత విషయంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.రానా 2020 ఆగస్టు 8వ తేదీ మిహికా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

కరోనా కావడంతో కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.వీరి వివాహం అనంతరం మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలలో మిహికా కాస్త బొద్దుగా కనిపించడంతో అందరూ తాను తల్లి కాబోతున్నట్టు భావించి పెద్ద ఎత్తున ఈ వార్తలను వైరల్ చేశారు.

Telugu Daggubati, Daggubati Fans, Mihika Bajaj, Mihikabajaj, Rana Daggubati, Ran

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇదే విషయంపై ఏకంగా మిహికాను ప్రశ్నించారు.మీరు నిజంగానే తల్లి కాబోతున్నారా అంటూ ప్రశ్నించగా వెంటనే ఈ ప్రశ్నపై స్పందించిన మిహిక నేను ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో ఉన్నాను.అందుకే ఈ మధ్య కాస్త హెల్దిగా మారాను అంటూ ఈమె సమాధానం చెప్పుకొచ్చారు.ఇలా తాను వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నానని అంతకుమించి మరేమీ లేదంటూ మిహిక సమాధానం చెప్పడంతో తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.

k

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube