జీవిత, రాజశేఖర్( Jivanta, Rajasekhar ) ఇద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతుకులు అని చెప్పవచ్చు.తల్లి చాటు బిడ్డలాగా భార్య చాటు భర్తలా రాజశేఖర్ ( Rajasekhar )వ్యవహరిస్తాడనే ప్రచారం కూడా ఉంది.
ఇంట్లో పూర్తిగా జీవితదే పెత్తనం అని కూడా అంటారు.ఆమెకు నచ్చని ఏ పనీ చేయడానికి రాజశేఖర్ ధైర్యం కూడా చేయడని టాక్.
అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత వీటన్నిటికీ రివర్స్ లో తమ లైఫ్ సాగుతుందని చెప్పింది.ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా తన భర్తే తీసుకుంటాడని, అతడి మాటను జవదాటనని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
చివరికి తాను కట్టుకునే శారీలను కూడా రాజశేఖర్ సెలెక్ట్ చేస్తాడని, అతడు సెలెక్ట్ చేస్తుందే తాను కట్టుకుంటానని చెప్పి నోరెళ్ళ బెట్టేలా చేసింది.

ఎప్పుడేనా రాజశేఖర్ షాపింగ్ కి తీసుకెళ్లి చీర కొని పెట్టారా అని ఇంటర్వ్యూయర్ అడగగా.జీవిత సమాధానం చెబుతూ.“హా, ఎప్పుడూ ఆయనే నా కోసం చీరలు కొంటారు.నేను కట్టే ప్రతి శారీ ఆయనే సెలెక్ట్ చేశారు.ఇప్పుడు కట్టుకున్నది కూడా రాజశేఖర్ గారు సెలెక్ట్ చేసిందే.ఆయన సెలెక్ట్ చేయని శారీ నేను కట్టుకోకపోతే వెంటనే తెలిసిపోతుంది.అప్పుడు ఈ చీర నేను సెలెక్ట్ చేయలేదే అంటాడు.అంత గుర్తుంటుంది ఆయనకు.” అని చెప్పుకొచ్చింది.

చాలామంది ఇతర మహిళలు తన శారీ బాగుంటుందని కాంప్లిమెంట్ ఇస్తుంటారని కూడా ఆమె తెలిపింది.“ఎవరు సెలెక్ట్ చేశారని అడిగినప్పుడు మా ఆయన్ని మీరు కూడా తీసుకెళ్లండి, నాకు లాగానే మీకు కూడా సరైన శారీ సెలెక్ట్ చేస్తాడని నేను చెబుతాన”ని ఆమె నవ్వులు పూయించింది.రాజశేఖర్ కి టైం ఉన్నప్పుడల్లా షాపింగ్ కి వెళ్లి ఒకేసారి 20 శారీలు కొనుగోలు చేస్తామని జీవిత వెల్లడించింది.తాను కూడా ఆయన కోసం డ్రస్సులు సెలెక్ట్ చేస్తానని, ఇద్దరిదీ టేస్ట్ ఒకేలా ఉంటుందని పేర్కొంది.
ఇలాంటి డీప్ రిలేషన్ THఆమె మధ్య ఉంటుందని వివరించింది.తనపై ప్రతి విషయంలో డిపెండ్ అవుతాడని, తాన ఏదైనా తప్పు చేస్తే తట్టుకోలేక బాగా తిట్టేస్తాడని, ఆయన చాలా షార్ట్ టెంపర్ అని తెలిపింది.
అయితే జీవిత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీరిద్దరూ పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.