ఈ మధ్య కాలంలో ఏ జోడీపై రాని స్థాయిలో నరేష్ పవిత్ర లోకేష్ జోడీపై రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.నరేష్ పవిత్ర లోకేశ్ విడిపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
అయితే తాజాగా వాళ్లిద్దరూ కలిసి కనిపించి వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు.అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాకు రివ్యూలు పాజిటివ్ గా రావడంతో నరేష్ పవిత్ర మీడియా ముందుకు వచ్చి ఆ రివ్యూల గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా గురించి నరేష్ స్పందిస్తూ పవిత్ర లోకేశ్ పై చెయ్యి వేసి మాట్లాడారు.నరేష్ ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని రిజల్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉందని ఆయన అన్నారు.ఈ సినిమా చూసి వందల సంఖ్యలో పాజిటివ్ గా మెసేజ్ లు చేస్తున్నారని నరేష్ వెల్లడించారు.
కంటెంట్ బేస్డ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిందని నరేష్ వెల్లడించారు.నరేష్ పవిత్ర కలిసే ఉన్నారని వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.
అయితే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.నరేష్ మరో అమ్మాయికి ప్రాధాన్యత ఇస్తున్నాడని వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
నరేష్, పవిత్ర లోకేశ్ జంటగా వరుసగా సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.నరేష్, పవిత్ర తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో కూడా పవిత్ర నరేష్ కలిసి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది.