ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు ! తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ ?

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ఒక పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించే విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

 From Here To There .. From There To Here! Jumping Politics In Telangana Telangana, Trs, Kcr, Ktr,revanth Reddy, Bandi Sanjay, Jumping Leaders, Bjp Meeting, Modhi, Amith Sha, Telangana Elections,-TeluguStop.com

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో, ఇప్పటి నుంచే తెలంగాణలోని ప్రధాని పార్టీలన్నీ రాజకీయ వ్యూహాలకు తెర తీశాయి.ముఖ్యంగా చేరికల విషయంలో అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.

అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బిజెపిలోకి చేరికలు ఉండే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేసుకుంటూ ఉండగా,  టిఆర్ఎస్ మాత్రం బిజెపిలోని అసంతృప్త నాయకులను వరుసగా చేర్చుకుంటూ కాంగ్రెస్ హడావుడి చేస్తోంది.కొద్దిరోజుల క్రితం టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరారు .మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పిటిసిలు కీలక నాయకులు ఇలా చాలామంది రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్  చేరారు.

 From Here To There .. From There To Here! Jumping Politics In Telangana Telangana, TRS, Kcr, Ktr,revanth Reddy, Bandi Sanjay, Jumping Leaders, Bjp Meeting, Modhi, Amith Sha, Telangana Elections, -ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

      తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ లో చేరికలు బిజెపి, టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి.

ఇక బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు మూడు తేదీలు జరగనున్న నేపథ్యంలో , ఆ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే ఆ పార్టీకి గట్టి జలక్ తగిలింది.నలుగురు జిహెచ్ఎంసి కార్పొరేటర్లు జంప్ చేశారు.

  రాజేందర్ నగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్,  కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ సిందుజా గౌడ్, కౌన్సిలర్ అలిప్లు, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
   

Telugu Amith Sha, Bandi Sanjay, Bjp, Modhi, Revanth Reddy, Telangana-Politics

   ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతుండగా బిజెపి నుంచి ఇప్పుడు టిఆర్ఎస్ లోకి జంపింగ్ లు చోటు చేసుకుంటున్నాయి.ఎవరు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో తెలియక మూడు ప్రధాన పార్టీలు టెన్షన్ గాని ఉంటున్నాయి.అయినా పట్టు సాధించేందుకు చేరికలను ఎక్కువగా ప్రోత్సహించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా,  ఇప్పటి నుంచే పార్టీలోకి చేరికలను ప్రోత్సహించి మరింత బలోపేతం చేయాలి అనే దిశగా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తుండడంతో వలస నేతలకు సైతం ప్రాధాన్యం పెరుగుతోంది. 

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube