ఘనంగా 10 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నాని దంపతులు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు.ఈయన సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు.

 Nani Couple Celebrated Their 10th Wedding Anniversary Details, Nani , Hero Nani,-TeluguStop.com

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి నాని అష్టా చమ్మ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దసరా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇండస్ట్రీలో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నాని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.అయితే నాని భార్య అంజన మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే అంజన సోషల్ మీడియా వేదికగా నేడు తన పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.

అంజనా ఇంస్టాగ్రామ్ ద్వారా నానితో కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే కాకుండా తన కుమారుడు అర్జున్ తో కలిసి దిగినటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ టెన్ ఇయర్స్ అంటూ హార్ట్ సింబల్ షేర్ చేస్తూ తన వివాహ వార్షికోత్సవం గురించి తెలియజేశారు.అక్టోబర్ 27వ తేదీ తమ పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడంతో ఎంతో మంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్లు చేస్తూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా తమ అభిమాన హీరో పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడంతో ఎంతోమంది పెద్ద ఎత్తున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube