ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని మాజీమంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని తెలిపారు.
చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని పేర్కొన్నారు.రాష్ట్రంలో అందరూ బాగుండాలని జగన్ కోరుకుంటున్నారని అన్నారు.
కానీ తాము మాత్రమే బాగుండాలని అమరావతి రైతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని వెల్లడించారు.
ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.